<h2>తల్లిదండ్రుల కోసం సమాచారం</h2>

స్వాగతం!

సూపర్‌బుక్ పిల్లల వెబ్‌సైట్‌కి స్వాగతం – ఇది పిల్లలు కొన్ని మధురమైన ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేందుకు, బైబిల్ గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వారి విశ్వాసాన్ని పెంచుకోవడానికి సురక్షితమైన ప్రదేశం!

ఇది ఎలా పని చేస్తుందో ఇక్కడ ఉంది

మీ పిల్లలు (13 ఏళ్లలోపు) సూపర్ బుక్ పిల్లల వెబ్‌సైట్‌లో చేరడానికి సైన్ అప్ చేసినప్పుడు, మేము మీకు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తాము, తద్వారా మా సమాజంలో పాల్గొనాలనే వారి కోరిక మీకు తెలుస్తుంది. మీ పిల్లల నమోదు సైట్‌లోని అన్ని రకాల సరదా కార్యకలాపాలను అంటే పోటీల్లో పాల్గొనడం లేదా మా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నప్పుడు వారు పోగుచేసే పాయింట్‌లను భద్రపరచుకోవడం లాంటి వాటిని వినియోగించడానికి లేదా చూడడానికి వారిని అనుమతిస్తుంది. సైట్‌లో పెట్టె కొత్త ఆటలను గురించి లేదా మీ పిల్లలకు ఆసక్తి కలిగించే భవిష్యత్తు పోటీల గురించి మీకు తెలియజేయడానికి మేము కాలానుగుణంగా మీకు ఇ-మెయిల్ పంపుతాము. ఈ సైట్‌లో సేకరించిన మొత్తం సమాచారం మీ పిల్లల ఆనందం కోసం మా సైట్‌ని మెరుగుపరచడంలో మాకు సహాయపడటానికి ఉపయోగించబడుతుంది. మీకు మరింత సమాచారం కావాలంటే దయచేసి మా గోప్యతా విధానాన్ని సమీక్షించండి.

సూపర్ బుక్

మేము దేని గురించి ఉన్నాము

మీ పిల్లలు రావాలని, ఆడాలని మరియు మా కార్యకలాపాలతో పరస్పరం సంభాషించాలని కోరుకునే వినోదభరితమైన స్థలాన్ని రూపొందించడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. అది మా పిల్లల ఆటలైనా, మా పిల్లల రేడియో అయినా, మా పాత్రల సృష్టికర్త అయినా లేదా దేవుని గురించిన మా సంభాషణాత్మక ప్రశ్నలైన, పిల్లలు మా సైట్ నందు ఆనందిస్తూఅదే సమయంలో బైబిల్ గురించి నేర్చుకుంటూ మరియు యేసుతో వారి సంబంధాన్ని అభివృద్ధి పరచుకోవాలని కోరుకుంటున్నాము

CBN పేరెంటింగ్

తల్లిదండ్రులు మరియు పిల్లలకు వారి విశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు దేవునితో వారి నడవడానికి శక్తివంతమైన వనరులను అందించడంతో పాటు, మేము క్రైస్తవ సంఘాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నాము. మా మరొక సైట్ , CBN పేరెంటింగ్‌లో, మీరు మా సోషల్ నెట్‌వర్క్ my.CBN.com ద్వారా ఇతర క్రైస్తవ తల్లిదండ్రులతో కనెక్ట్ అవ్వగలరు, ఇక్కడ మీరు ఈ క్రింది వాటిని చేయవచ్చు:

  • - ఇతర తల్లిదండ్రులతో కనెక్ట్ అవ్వొచ్చు
  • - కుటుంబ సంబంధిత అంశాలను చర్చించవచ్చు.
  • - ఇతర తల్లిదండ్రులతో కలిసి పరిచర్యలో పాల్గొనవచ్చు

పిల్లలను బైబిల్ ప్రకారం పెంచడం, మీ పిల్లల కోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని అభివృద్ధి చేయడం, సానుకూల ప్రభావాలను నెలకొల్పడం వంటి తల్లిదండ్రులకు ముఖ్యమైన అంశాలతో క్రమం తప్పకుండా నవీకరించబడిన కథనాలను కూడా మీరు కనుగొంటారు!

ఆన్‌లైన్ భద్రత

మేము మా వెబ్‌సైట్‌ను పిల్లలకు సురక్షితమైన ప్రదేశంగా రూపొందించాము, అయితే పిల్లలు కలిగి ఉండే అత్యుత్తమ భద్రత వారి ఆన్‌లైన్ కార్యకలాపాలతో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు భాగమవ్వడం ద్వారా కలుగుతుంది. మీరు మీ పిల్లల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరియు వారికి అవగాహన కల్పించడానికి మాత్రమే కాకుండా, మా సైట్‌లో వారు నేర్చుకొనే విషయాల్లో వారిని ప్రోత్సహించడానికి కూడా ఆన్‌లైన్‌లో సమయాన్ని వెచ్చించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

ఆన్‌లైన్ భద్రతా వనరులు

సూపర్ బుక్

ధన్యవాదాలు!

మా సైట్‌ని సందర్శించినందుకు ధన్యవాదాలు! మేము మా వెబ్‌సైట్‌ను అభివృద్ధి పరచడానికి, వృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాము మరియు దీన్ని మరింతగా మెరుగుపరచడానికి మీ యొద్ద ఏవైనా సూచనలు ఉంటే వినడానికి ఇష్టపడుతున్నాము. మమ్మల్ని సంప్రదించండి.

ప్రొఫెసర్ క్వాంటమ్స్ Q & ఒక వింత పరికరం