<h2>FAQ</h2>

సూపర్‌బుక్ సిరీస్

సూపర్‌బుక్ అంటే ఏమిటి?

1981లో, ది క్రిస్టియన్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ జపాన్ దేశానికి సువార్త అందించే ప్రక్రియలో భాగంగా పిల్లల కోసం యానిమేటెడ్ బైబిల్ సిరీస్‌ను రూపొందించింది. ఈ సిరీస్ జపాన్‌లో మరియు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో మాకు అప్పుడు అంతగా తెలియలేదు. ఈ సిరీస్‌కి ఆంగ్ల పేరు "సూపర్‌బుక్."

సువార్తను అందించే ప్రకియ సమయంలో మరియు తర్వాత చేసిన పరిశోధన ఈ సిరీస్ అపూర్వమైన విజయాన్ని సాధించిందని తేలింది. సూపర్‌బుక్ ను, యానిమేటెడ్ పేరెంట్ మరియు చైల్డ్ థియేటర్ అని కూడా పిలుస్తారు, ఇది అమెరికాలోని క్రిస్టియన్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌తో కలిసి జపాన్‌లోని టాట్సునోకో ప్రొడక్షన్స్ నిర్మించిన అనిమే టెలివిజన్ సిరీస్. దీనిని జపాన్‌లో ప్రారంభిన సమయంలో, టెలివిజన్‌లో సూపర్‌బుక్ యొక్క ప్రతీ వారపు ఎపిసోడ్‌ను 40 లక్షలకు పైగా ప్రజలు వీక్షించారని అంచనా వేయబడింది, ఫలితంగా బైబిల్ ఆ దేశంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకంగా మారింది.

జపాన్ మొదలుకొని, సూపర్‌బుక్ సిరీస్ ఆసియా నుండి ఉత్తర అమెరికా వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబడింది. 1989 నాటికి, ఆర్థిక మరియు రాజకీయ గందరగోళాల మధ్య, సూపర్‌బుక్ సోవియట్ యూనియన్‌లో ప్రసారమై, అద్భుతమైన ఫలితాలను సాధించింది. సూపర్‌బుక్, సోవియట్ నేషనల్ ఛానల్లో ప్రైమ్‌టైమ్ లో ప్రసారం అయ్యింది. CBN పిల్లల నుండి 60 లక్షలకు పైగా ఉత్తరాలను అందుకుంది, సరికొత్త తరాన్ని బైబిల్‌కు పరిచయం చేసింది. నేటికీ, సూపర్‌బుక్ కిడ్స్ క్లబ్ ఉక్రెయిన్‌లో అత్యధిక రేటింగ్ పొందిన లైవ్-యాక్షన్ పిల్లల ప్రోగ్రామ్‌లలో ఒకటి.

జపాన్‌లో మొదటిసారి ప్రసారమైనప్పటి నుండి, ఈ సిరీస్ ఇప్పుడు 106 దేశాలలో ప్రసారమవుతూ, 43 భాషల్లోకి అనువదించబడింది మరియు 50 కోట్ల మంది వీక్షించారు.

నేటి కథను కొత్తగా చెప్పే సాంకేతికత కారణంగా, మీడియా-అవగాహన ఉన్న ఈ తరంలో ప్రప్రధమ సిరీస్ తన ఆకర్షణను కోల్పోతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, CBN పునర్విశ్లేషణ చేసిన, కంప్యూటర్ ఆధారిత, యానిమేటెడ్ వెర్షన్‌ సూపర్‌బుక్ నిర్మిస్తోంది. జీవితాన్ని మార్చే అసలు సిరీస్ యొక్క వారసత్వాన్ని గౌరవిస్తూ, కొత్త తరానికి దాన్ని మళ్లీ పరిచయం చేసే కొత్త సిరీస్‌ను రూపొందించడమే మా లక్ష్యం.

నేను సిరీస్ యొక్క DVDలను ఎలా కొనుగోలు చేయాలి?

సూపర్‌బుక్ DVD క్లబ్‌లో చేరడం ద్వారా. మీరు సూపర్‌బుక్ DVD క్లబ్‌లో చేరినప్పుడు, సూపర్‌బుక్ యొక్క ప్రతి కొత్త ఎపిసోడ్‌ను మీరు అసంకల్పితంగా పొందుతారు. దానికి తోడు, మేము ప్రతి కొత్త ఎపిసోడ్ యొక్క రెండు కాపీలను ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌లో మీకు పంపుతాము, మీరు ఇతరులకు వాటిని బహుమతులుగా ఇవ్వవచ్చు. మీ పన్ను మినహాయింపు బహుమతి భవిష్యత్తులో సూపర్‌బుక్ ఎపిసోడ్‌లను రూపొందించడంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు దేవుని వాక్యాన్ని అందించడంలో సహాయపడుతుంది. మీరు ఇక్కడ సూపర్‌బుక్ DVD క్లబ్ గురించి మరింత తెలుసుకోవచ్చు.

నా ఖాతా

నేను నా పాస్‌వర్డ్ లేదా యూజర్ నేమ్ మరచిపోయినట్లయితే నేను ఏం చేయాలి?

మీరు మీ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే, పేజీ ఎగువన ఉన్న "సైన్ ఇన్" లింక్‌పై క్లిక్ చేయండి. తెరుచుకున్న బాక్స్ లో , "పాస్‌వర్డ్" భాగం క్రింద ఉన్న "నేను నా పాస్‌వర్డ్‌ను మర్చిపోయాను" అనే దాని మీద క్లిక్ చేయండి.

మీరు “నేను నా పాస్‌వర్డ్‌ మర్చిపోయాను”పై క్లిక్ చేసిన తర్వాత కొత్త “పాస్‌వర్డ్ రికవర్” ఫారమ్‌ కనిపిస్తుంది మరియు మీరు మీ యూజర్ నేమ్ మరియు మీ పేరు మొదటి భాగాన్ని నమోదు చేసి, ఆపై "కొనసాగించు" నొక్కండి. మీరు మీ ఇమెయిల్‌ చెక్ చేసినట్లయితే, అక్కడ మీకు కొత్త పాస్‌వర్డ్‌తో కూడిన ఇమెయిల్‌ కనబడుతుంది. మీరు దానిని మీ యూజర్ నేమ్ తో వెబ్‌సైట్‌లో ఉపయోగించవచ్చు.

ఆ సమయంలో, మీరు మీ పాస్‌వర్డ్‌ను మీరు గుర్తుంచుకోవడానికి మరింత సులభంగా ఉండేలా మార్చాలనుకొంటే, అప్పుడు మీరు మీకు వచ్చిన ఇమెయిల్‌లోని లింక్‌పై క్లిక్ చేసి, మార్చుకోవచ్చు ఆ కొత్త పాస్‌వర్డ్‌ను మా మా వెబ్‌సైట్‌లో ఉపయోగించుకోవచ్చు.

మీరు మీ యూజర్ నేమ్ మరచిపోయినట్లయితే,మీరు ఖాతాను తెరవడానికి ఉపయోగించిన ఇమెయిల్ చిరునామాతో సూపర్‌బుక్ టీమ్ మెంబర్‌ని సంప్రదించండి.

నేను ఎందుకు నమోదు చేసుకోవాలి?

మీరు నమోదు చేసుకున్న తర్వాత మీరు ఒక క్యారెక్టర్ సృష్టించడానికి, మీ స్కోర్‌లను రికార్డ్ చేయడానికి, మీకు ఇష్టమైన ఆటలను సేవ్ చేయడానికి, సూపర్‌పాయింట్‌లను సేకరించడానికి, మీ సూపర్‌పాయింట్‌లను మంచి బహుమతుల కోసం మార్చుకోవడానికి మరియు మీ వ్యక్తిగత ప్రొఫైల్ క్యారెక్టర్ కొరకు అప్‌గ్రేడ్‌లను పొందడానికి మీ సూపర్‌పాయింట్‌లను ఉపయోగించడానికి మీరు అనుమతించబడతారు.

నేను Superbook.TVలో ఎలా నమోదు చేసుకోవాలి?

Superbook.TV కొరకు నమోదు చేసుకోవడానికి:

  • వెబ్‌సైట్ లోని స్వాగతం ప్రదేశంలో "నమోదు" మీద క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ విండో తెరవబడుతుంది మరియు మీరు ఫారమ్‌ను పూరించాలి.
  • మీకు 12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, మీరు మీ తల్లిదండ్రుల ఇమెయిల్‌ను అందించవలసి ఉంటుంది.
  • మీకు 13 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, మీరు మీ స్వంత ఇమెయిల్ చిరునామాను అందించాలి CBN నుండి మీకు ఇమెయిల్‌ వస్తుంది, అక్కడ మీరు మీ అకౌంట్ ను యాక్టివేట్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీరు CBN కమ్యూనిటీ మెంబర్ గా ఉంటూ, 13 ఏళ్లు పైబడిన పిల్లలను నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు ఆ చిన్నారి కోసం మరొక ఇమెయిల్ చిరునామాను ఉపయోగించాల్సి ఉంటుంది, అంటే మరొక CBN కమ్యూనిటీ ఖాతాను తెరవండి - ఇది కొత్త ఖాతా అవుతుంది.

నేను నా పాస్‌వర్డ్ మరియు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎలా మార్చవచ్చు

మీ పాస్‌వర్డ్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని మార్చడానికి మీరు ముందుగా మీరు మీ ఖాతా సైన్ చేయాలి ఆ తరువాత పేజీ ఎగువన ఉన్న మీ ప్రొఫైల్ పేరుపై క్లిక్ చేయండి. ఒకసారి మీరు మీ ప్రొఫైల్ పేజీకి వెళ్ళాక, మీ క్యారెక్టర్ ప్రొఫైల్‌కు కుడివైపున ఉన్న "ప్రొఫైల్‌ని సవరించు"పై క్లిక్ చేయండి. అప్పుడు మీరు మీ పాస్‌వర్డ్ మరియు ఏదైనా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని మార్చుకోవచ్చు.

నేను నా సూపర్‌బుక్ వ్యక్తిగత ప్రొఫైల్ క్యారెక్టర్‌కి ఎలా మార్పులు చేయాలి?

మీ సూపర్‌బుక్ క్యారెక్టర్‌ని మార్చడానికి, మీరు ఈ క్రింది దశలను అనుసరించాల్సి ఉంటుంది:

  • లాగ్ ఇన్.
  • వెబ్‌సైట్ యొక్క ఎగువన ఉన్న నావిగేషన్ పైన మీ క్యారెక్టర్‌ యొక్క ముఖం మీద క్లిక్ చేయండి. ఒక డ్రాప్ బాక్స్ తెరవబడుతుంది మరియు మీరు మీ క్యారెక్టర్ యొక్క చిత్రంపై క్లిక్ చేయాలి, అది మిమ్మల్ని మీ ప్రొఫైల్ పేజీకి తీసుకెళ్తుంది.
  • మీ క్యారెక్టర్ పక్కన, మీరు "షాప్" మరియు "అలమరా" అనే పదాలను చూస్తారు. మీ క్యారెక్టర్ తన అలమారాలోని కొన్ని దుస్తులు వేసుకొని వస్తుంది. ఈ దుస్తులను అందుకోవడానికి, "అలమారా" అనే అనే పదం మీద క్లిక్ చేస్తే, మీ అలమరాలో ఉన్న దుస్తులు కనిపిస్తాయి.
  • మీ అలమారా రెండు వైపుల ఉన్న బాణపు గుర్తులను ఉపయోగించి, అలమారాలోని వస్తువులను చూడవచ్చు లేదా మీరు అలమరాలో ఉన్న ప్రధాన చిత్రాల క్రింద ఎంపిక చేసుకొని, నిర్దిష్ట దుస్తుల రకాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ ఉండే వస్త్రాధారణ వస్తువులు: ఎ) అన్నీ బి) హెడ్ గేర్ సి) టాప్స్ డి) బాటమ్స్ ఇ) షూస్ మరియు ఎఫ్) బ్యాక్‌గ్రౌండ్‌లు. మీరు ఇక్కడున్న వాటిల్లో దేనినైనా క్లిక్ చేస్తే, దానికి సంబంధించినవి మాత్రమే కనిపిస్తాయి.
  • ఇక్కడ మీరు మీ క్యారెక్టర్‌ యొక్క చర్మ రంగును మరియు కంటి రంగును కూడా మార్చవచ్చు.
  • మీరు మీ అలమరాలో మరిన్ని వస్తువులను జోడించాలనుకుంటే, మీరు "షాప్" బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇది మీరు 'ప్రయత్నించగల' మరియు 'కొనుగోలు' చేయగల లేదా ఉచితంగా లేదా సూపర్ పాయింట్స్ మార్పిడి ద్వారా వచ్చే కొత్త వస్తువులను తెస్తుంది. 'కొనండి' బటన్ లేదా "ఏమి ఉందో కొనండి" బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా, మీరు ఒక వస్తువును 'కొనుగోలు' చేసిన తర్వాత, మీరు దానిని ధరించి చూడాలనుకొన్నప్పుడు "దుకాణం" మరియు "అలమరా" బటన్‌ల పైన కనిపించే, ఆ వస్తువు మీ రూపం మీద ఉంటుంది మరియు మీ అలమరా లోకి వెళుతుంది.

నేను ఎక్కువ మంది పిల్లలను ఎలా నమోదు చేయాలి?

మేము నమోదు వ్యవస్థను ఏర్పాటు చేసిన విధానం ద్వారా పిల్లలు అదే తల్లిదండ్రుల ఇమెయిల్ చిరునామాకు కనెక్ట్ చేయబడతారు. కాబట్టి, మీరు ఎప్పుడు మీ పిల్లలలో ప్రతి ఒక్కరిని నమోదు చేయండి, ప్రతి ఒక్కరూ తమ స్వంత యూజర్ నేమ్ మరియు పాస్‌వర్డ్‌ను కలిగి ఉండవచ్చు. మరియు వారు తమ స్వంత సూపర్‌పాయింట్‌లను కలిగి ఉండవచ్చు. అలాగే తమ స్వంత ఆన్‌లైన్ పాత్రను కూడా సృష్టించవచ్చు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఇప్పటికే సృష్టించిన ఖాతా నుండి లాగ్అవుట్ అవ్వడం, ఆపై మీరు అసలు ఖాతాతో చేసిన అదే నమోదు ప్రక్రియను అనుసరించరించడం, అదే ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి ప్రతి చిన్నారికి కొత్త యూజర్ నేమ్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం.


ఆటలు

సూపర్ పాయింట్స్ అంటే ఏమిటి?

నమోదిత వినియోగదారులచే Superbook.TVలో గేమ్ ప్లే చేయడం ద్వారా SuperPoints సేకరించబడతాయి. ప్రస్తుతం, మీరు మా పోటీ పేజీని సందర్శించవచ్చు మరియు మా పోటీలలోకి ప్రవేశించడానికి SuperPoints మార్పిడి చేసుకోవచ్చు. లేదా మీరు వాటిని ఉపయోగించి మీ వ్యక్తిగత ప్రొఫైల్ క్యారెక్టర్‌ని కొన్ని ఆకర్షణీయమైన దుస్తులతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

బ్యాడ్జ్‌లు అంటే ఏమిటి మరియు నేను వాటిని ఎలా పొందవచ్చు?

మీరు Superbook.TVకి నమోదు చేసుకున్న తర్వాత, మీరు సంపాదించిన సూపర్ పాయింట్స్ కొరకు బ్యాడ్జ్‌లను గెలుచుకునే అవకాశం, మీ సూపర్‌బుక్ క్యారెక్టర్‌ని సృష్టించడం, రిజిస్టర్ చేయడం మరియు ఇంకా అనేక విషయాలు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు ఎంత ఎక్కువగా ఆడితే, మీరు అన్ని ఎక్కువ బ్యాడ్జ్‌లను గెలుస్తారు!

నా ప్రొఫైల్‌కు నాకు ఇష్టమైన గేమ్‌ను ఎలా జోడించాలి?

ఇష్టమైన గేమ్‌ను జోడించడానికి వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి (మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత) మరియు నావిగేషన్ బార్‌ పైనున్న "గేమ్స్" బటన్‌పై క్లిక్ చేయండి. మీరు జోడించాలనుకుంటున్న గేమ్‌పై క్లిక్ చేయండి. గేమ్ పేజీ తెరవబడిన తర్వాత, మీరు 'థంబ్స్ అప్' చిత్రాన్ని చూస్తారు. మీరు ఈ చిత్రంపై క్లిక్ చేసిన తర్వాత గేమ్ మీ "FAVS" క్రింద మీ ప్రొఫైల్ పేజీకి, అలాగే అన్ని వెబ్‌సైట్ పేజీలలోని టాప్ నావిగేషన్ పైనున్న మీ క్యారెక్టర్ ప్రొఫైల్ హెడ్‌షాట్‌పై క్లిక్ చేసినప్పుడు తెరుచుకునే డ్రాప్ డౌన్ బాక్స్‌లో జోడించబడుతుంది.

నేను నమోదు చేసుకోకపోయినా, నేను గేమ్స్ ఆడవచ్చా?

అవును, మీరు నమోదు చేసుకోకపోయినా Superbook.TVలో అన్ని గేమ్‌లను ఆడవచ్చు.

మీరు కొత్త గేమ్స్ జోడిస్తారా?

అవును, వినోదభరితమైన కొత్త గేమ్‌లు మరియు ఫీచర్‌లతో Superbook.TVని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటాం. మా గేమ్స్ పేజీలో మా సరికొత్త గేమ్‌లను చూడండి.

గేమ్‌లలో సౌండ్‌ను ఎలా ఆఫ్ చేయాలి?

ప్రతి గేమ్, సౌండ్ ఎఫెక్ట్స్ మరియు/లేదా సంగీతాన్ని మ్యూట్ చేసే ఎంపికతో రూపొందించబడింది. సౌండ్ మ్యూట్ చేయడానికి మరియు అన్-మ్యూట్ చేయడానికి మ్యూజికల్ నోట్‌పై క్లిక్ చేయండి. మ్యూజికల్ నోట్ లేకుంటే "ఆప్షన్స్" "మ్యూజిక్ ఆఫ్" లేదా "సౌండ్ ఎఫెక్ట్స్ ఆఫ్" క్లిక్ చేయండి.

గేమ్స్ ఆడేందుకు నాకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కావాలా?

మీకు ఫ్లాష్ సాఫ్ట్‌వేర్ యొక్క సరికొత్త వెర్షన్ అవసరం కావచ్చు. అలాగే, ఈ ఫ్లాష్ గేమ్‌లు ఐప్యాడ్, ఐపాడ్ టచ్‌లు లేదా ఐఫోన్‌లలో పని చేయవు. ఫ్లాష్‌ని ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి!


ఆన్‌లైన్ ఆధ్యాత్మిక విషయాలు

గిజ్మో చేసిన బైబిల్ సంబంధింత సాహస యాత్రలను గూర్చిన ఆధ్యాత్మిక విషయాలను వీక్షించడానికి నాకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అవసరమా?

ఆన్‌లైన్ ఆధ్యాత్మిక విషయాలు వీక్షించడానికి మీకు Adobe PDF Reader అవసరం కావచ్చు. దీన్ని ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి!

మీ వద్ద పిల్లల కోసం ఏదైనా ఇతర ఆన్‌లైన్ ఆధ్యాత్మిక విషయలను గూర్చిన సమాచారం ఉందా?

మా అనుదిన బైబిల్ సవాలు వద్దకు మిమ్మల్ని తీసుకెళ్తున్న రోజువారీ ఇమెయిల్‌ను పొందడానికి మీరు సభ్యత్వం తీసుకోవచ్చు . ప్రతి రోజు అనుదిన బైబిల్ సవాలు పిల్లలకు బైబిల్ వాక్యం చదవడానికి మరియు ఆ తర్వాత బైబిల్ వాక్యంతో మరింత సుపరిచితం కావడానికి మరియు ఆ వచనం వారి జీవితాలకు ఎలా అన్వయించవచ్చో కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడే ఆటలను అందిస్తుంది. గేమ్స్ లో పదాలను వెతకడం, బహుళ ఎంపికలు గల క్విజ్‌లు మరియు వచనాన్ని తిరిగి టైప్ ఉంటాయి.


తల్లిదండ్రుల సమాచారం

మీరు ఈ వెబ్‌సైట్‌ను ఎందుకు సృష్టించారు?

మీ పిల్లలు రావాలనుకునే, ఆడుకొనే మరియు మా కార్యకలాపాల్లో పరస్పరం పాల్గొనే వినోదభరితమైన స్థలాన్ని రూపొందించడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. అది మన పిల్లల ఆటలైనా, మన ఆన్‌లైన్ బైబిల్ అయినా, సూపర్‌బుక్ రేడియో, వ్యక్తిగత పాత్రను సృష్టించడం లేదా దేవుని గురించిన పరస్పర ప్రశ్నలయినా, పిల్లలు మా సైట్‌లో ఏకకాలంలో బైబిల్ గురించి నేర్చుకుంటూ మరియు యేసుతో వారికుకున్న సంబంధంలో ఎదుగుతూ ఆనందంగాగడపాలని కోరుకొంటున్నాం.

ఈ వెబ్‌సైట్ పిల్లలకు సురక్షితమేనా?

మేము మా వెబ్‌సైట్‌ను పిల్లలకు సురక్షితమైన ప్రదేశంగా రూపొందించాము, అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను గమనిస్తూ ఉండడం ద్వారా మరింత భద్రంగా ఉండవచ్చు. మేము మీ పిల్లలతో ఆన్‌లైన్‌లో సమయాన్ని వెచ్చించమని, వారి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరియు వారికి అవగాహన కల్పించడానికి మాత్రమే కాకుండా, మా సైట్‌లో వారు నేర్చుకుంటున్న విషయాలలో వారిని ప్రోత్సహించమని కూడా మిమ్మల్ని కోరుతున్నాం. మరింత సమాచారం కోసం దయచేసి మా తల్లిదండ్రులకు సమాచారం పేజీని సందర్శించండి.

మా పిల్లల సూపర్‌బుక్ ఖాతాపై నాకు నియంత్రణ ఉంటుందా?

అవును. మీ చిన్నారి (13 ఏళ్లలోపు) Superbook Kids వెబ్‌సైట్‌లో చేరడానికి సైన్ అప్ చేసినప్పుడు, మేము మీకు ఇ-మెయిల్ ద్వారా తెలియజేస్తాము, తద్వారా మా గుంపులో పాల్గొనాలనే వారి కోరిక గురించి మీరు తెలుసుకుంటారు. మీ పిల్లల నమోదు చేసుకోవడం ద్వారా సైట్‌లోని అన్ని రకాల సరదా కార్యకలాపాలను యాక్సెస్ చేయడానికి వారిని అనుమతిస్తుంది, అంటే, పోటీలలో పాల్గొనడం లేదా మా ఆన్‌లైన్ గేమ్‌లను ఆడుతున్నప్పుడు వారు కూడబెట్టె పాయింట్లను సేవ్ చేయగలగడం వంటివి. మీకు తెలియజేయడానికి మేము క్రమం తప్పకుండా మీకు ఇ-మెయిల్ కూడా పంపవచ్చు సైట్‌కు జోడించబడుతున్న కొత్త గేమ్‌ల గురించి లేదా మీ పిల్లలకు ఆసక్తి కలిగించే భావి పోటీల గురించి మీకు తెలియజేయడానికి మేము క్రమం తప్పకుండా మీకు ఇ-మెయిల్ పంపవచ్చు. ఈ సైట్‌లో సేకరించిన మొత్తం సమాచారం మీ పిల్లల ఆనందం కోసం మా సైట్‌ని మెరుగుపరచడంలో మాకు సహాయపడటానికి ఉపయోగించబడుతుంది. మరింత సమాచారం కోసం దయచేసి మా తల్లిదండ్రులకు సమాచారం పేజీని సందర్శించండి.


పోటీలు & బహుమతులు

నేను పోటీలో ఎలా పాల్గొనగవచ్చు?

Superbook.TV లో పోటీల్లో పాల్గొనే ప్రక్రియ క్రింది విధంగా ఉంది:

  • సైట్‌లో నమోదు చేసుకోండి. ఇది సైట్ యొక్క కుడివైపున ఎగువున్న ప్రాంతంలో జరుగుతుంది.
  • మీరు సైట్‌కి లాగిన్ అయినప్పుడు సైట్‌లో గేమ్‌లు ఆడండి. మీ స్కోర్‌లు ఎంత ఎక్కువగా ఉంటే, మీరు అంత ఎక్కువ సూపర్‌పాయింట్‌లను గెలుచుకోవచ్చు. ఈ సూపర్‌పాయింట్‌లు మీ ప్రొఫైల్‌లో సేవ్ చేయబడతాయి, వీటిని ప్రొఫైల్ పేజీలో వీక్షించవచ్చు - వెబ్‌సైట్‌లోని ప్రతి పేజీ ఎగువన ఉన్న మీ వ్యక్తిగత పాత్ర యొక్క హెడ్‌షాట్ ద్వారా మీరు మీ ప్రొఫైల్ పేజీని యాక్సెస్ చేయవచ్చు.
  • పోటీలలోకి ప్రవేశించడానికి, మీరు "పోటీలు" పేజీకి వెళ్లాలి, ఈ లింక్‌ను ఏదైనా పేజీ ఎగువన ఉన్న నావిగేషన్ ఎంపికలలో చూడవచ్చు. మీరు ఆ పేజీలోకి ప్రవేశించిన తర్వాత, మీరు ఏదైనా పోటీల కోసం "ఇప్పుడే నమోదు చేయండి"పై క్లిక్ చేయండి. అప్పుడు అది మిమ్మల్ని నిర్దిష్ట పోటీలో పాల్గొనే పేజీకి తీసుకెళుతుంది. పోటీలో పాల్గొనడానికి ఎన్ని సూపర్‌పాయింట్‌లు అవసరమో ప్రవేశ పత్రం మీకు తెలియజేస్తుంది మరియు మీరు ఎన్నిసార్లు పాల్గొనాలనుకొంటున్నారో అది మిమ్మల్ని అడుగుతుంది. కాబట్టి ఒక పోటీ ప్రవేశం 250 సూపర్‌పాయింట్‌లకు సమానం అయితే, మీరు గేమ్‌లు ఆడడం ద్వారా సంపాదించిన 800 సూపర్‌పాయింట్‌లు మనీ దగ్గర ఉన్నాయని అనుకుందాం, అప్పుడు మీరు 3 సార్లు (750 సూపర్‌పాయింట్‌లు) పోటీలో ప్రవేశించవచ్చు మరియు మీకు దగ్గర ఇంకా 50 సూపర్‌పాయింట్‌లు మిగిలి ఉంటాయి. మీరు ఎన్నిసార్లు ప్రవేశించాలనుకొంటున్నారో ఆ సంఖ్యను మీరు నమోదు చేసిన తర్వాత, మీరు "పోటీలో పాల్గొనండి" క్లిక్ చేయండి. అప్పుడు మీరు పోటీలోకి ప్రవేశించబడతారు.

నేను గెలిచానో లేదో నాకు ఎలా తెలుస్తుంది?

మేము ప్రతి పోటీ విజేతను వారి బహుమతిని ఎలా సేకరించాలనే దానిపై తదుపరి సూచనలతో ఇమెయిల్ ద్వారా సంప్రదిస్తాము. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పోటీదారులందరికీ, వారి తల్లిదండ్రుల ఇమెయిల్ చిరునామాకు ఇమెయిల్ పంపబడుతుంది.

నేను నా బహుమతిని ఎలా స్వంతం చేసుకోవాలి?

సూపర్‌బుక్ సిబ్బంది మీ బహుమతిని ఎలా సేకరించాలనే సూచనలతో ఇమెయిల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. సాధారణంగా, వారు చిరునామా కోసం అడుగుతారు కాబట్టి మేము మీకు బహుమతిని పోస్టులో పంపగలము.

పోటీలు సాధారణంగా ఎంతకాలం ఉంటాయి?

పోటీ వ్యవధి మారుతూ ఉంటుంది, కానీ పేర్కొన్న ప్రతి పోటీలో మీరు ముగింపు తేదీలను చూడవచ్చు. పోటీ గడువు తేదీల కోసం పోటీలు మరియు బహుమతుల పేజీని తప్పకుండా చూడండి.

నేను నా బహుమతిని ఎంతకాలం లోపు సేకరించాలి?

మా సూపర్‌బుక్ సిబ్బంది పంపిన ఇమెయిల్‌ లోని సమయం నుండి విజేతలకు ఆ ఇమెయిల్ కు స్పందించడానికి పూర్తి వారం (ఏడు రోజులు) గడువు ఉంటుంది. ఆ సమయంలో మీ నుండి మాకు ప్రత్యుత్తరం రాకపోతే, మేము మరొక విజేతను ఎంచుకోవలసి ఉంటుంది.

మీరు ఎంత తరచుగా పోటీలను నిర్వహిస్తారు?

మాకు సంవత్సరంలో ప్రతి రోజు పోటీలు ఉంటాయి. మేము అందించే బహుమతులు SuperPoints నుండి Superbook DVDల వరకు, బహుమతి కార్డ్‌ల నుండి iPadల వరకు ఇలా మరెన్నో బహుమతులు ఉంటాయి.

పోటీ విజేతను ఎప్పుడు ఎంపిక చేస్తారు?

పోటీ ముగిసిన తర్వాత పోటీ విజేతను ఎంపిక చేస్తాం.

కాంటినెంటల్ అమెరికాకు మాత్రమే పోటీలు ఎందుకు పరిమితం చేశారు?

అమెరికా వెలుపల ఉన్న పోటీ చట్టం & నిబంధనలు ప్రస్తుతం అంతర్జాతీయ పోటీలను సృష్టించకుండా మాపై ఆంక్షలు విధిస్తున్నాయి.

నేను బహుమతిని సేకరించకూడదు నేను ఏమి చేయాలి?

మీరు బహుమతిని సేకరించకూడదు అనుకుంటే, దయచేసి మీరు దానినిస్వీకరించదలచుకోనట్లు సూచిస్తూ మా ఇమెయిల్‌కి తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వండి. ఆ తర్వాత మరో విజేతను ఎంపిక చేస్తాం.

పోటీకి సంబంధించి ఇతర ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా?

సూపర్‌బుక్ సిరీస్ - ఎపిసోడ్‌లు

ఓ మహా సాహసం

"మహా సాహసం"లో, సూపర్‌బుక్‌లో కనిపించే పిల్లలలో వైవిధ్యం లేకపోవడాన్ని మేము గమనించాము. భవిష్యత్తులో వచ్చే ఎపిసోడ్‌లలో అది మారుతుందా?

అవును. భవిష్యత్తులో రానున్న సూపర్‌బుక్ ఎపిసోడ్‌లలో ఆధునిక-కాలపు దృశ్యాలు కోసం ప్రస్తుతం మేము పిల్లలు మరియు పాత్రల్లో మరింత వైవిధ్యాన్ని తీసుకొచ్చేనందుకు ప్రయత్నం చేస్తున్నాము.

యేసు పునరుత్థానం!

"యేసు పునరుత్థానం"లో, యేసు చేతులకు బదులు మణికట్టు మీద మేకుల గుర్తులు ఎందుకు ఉన్నాయి?

యోహాను 20:25-27లో ఉపయోగించబడిన చేతులు అనే పదానికి గ్రీకులో ముంజేయి మరియు చేయి అని కూడా అర్ధం. చాలా మంది శాస్త్రవేత్తలు మరియు పండితులు ఒక వ్యక్తి యొక్క అరచేతులోని చిన్న ఎముకలు సిలువ వేయబడిన వ్యక్తి యొక్క బరువును భరించేంత బలంగా ఉండవని నమ్ముతారు. మణికట్టు ఎముకల (వ్యాసార్థం మరియు ముంచేతి ఎముక) మధ్య ఉంచిన మేకులు వ్యక్తి యొక్క శరీరం శిలువ మీద నుండి జారిపడిపోకుండా చూస్తాయి.

యేసుక్రీస్తు చేసిన అద్భుతాలుు

"యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు"లో, గుంపులో ఉన్న వ్యక్తి సాతానుగా ఎందుకు మారతాడు?

ఈ ఎపిసోడ్ స్క్రిప్ట్‌లో, వ్యక్తిని "నిరాధారకుడు" అని పిలుస్తారు. అతను సందేహం, అపహాస్యం మరియు అబద్ధాలను సూచిస్తాడు. యోహాను 8:44 సాతాను “అబద్ధానికి తండ్రి” అని చెబుతోంది.

"యేసు చేసిన అద్భుతాలు" లో, గదరేనీయుల సమాధులలో దయ్యం పట్టిన వ్యక్తి ఎందుకు చాలా భయానకంగా ఉన్నాడు మరియు అతని గొంతు ఎందుకు వింతగా ఉంది?

మార్కు 5:1-20 మరియు లూకా 8:26-39 రెండింటిలోనూ దయ్యం పట్టిన వ్యక్తి గురించి బైబిల్ చాలా స్పష్టంగా వివరిస్తుంది. అతనిలో చాలా దురాత్మలు ఉన్నాయి కాబట్టి చాలా మంది మాట్లాడుతున్నట్లు అతని గొంతు వినిపిస్తోంది. లూకా 8:31-32 యేసుతో మాట్లాడుతున్న “దయ్యాలు” (బహువచనం)ను సూచిస్తుంది.

“యేసు చేసిన అద్భుతాలు”లో సాతాను తుఫానులో ఎందుకు కనిపిస్తాడు? దానికి అతనే కారణమా?

తుఫానుకు సాతాను కారణమని బైబిల్ చెప్పడం లేదు; అయినప్పటికీ, మత్తయి 8:26, మనకు యేసు గాలిని మరియు అలలను "గద్దించాడు" మరియు అవి నిశ్చలంగా మారాయి చెబుతుంది. సువార్తలోని ఇతర ప్రదేశాలలో, యేసు దురాత్మల శక్తిపై అధికారాన్ని ప్రదర్శించినప్పుడు "గద్దింపు" అనే పదాన్ని ఉపయోగించారు. (మత్తయి 17:18, మార్కు 9:25, మరియు లూకా 9:42 చూడండి.) తుఫాను యొక్క అల్లకల్లోలం మరియు మునిగిపోతామనే భయంతో శిష్యులు ప్రతిస్పందించిన తీరును బట్టి వారు దేవునిపై విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించలేదో వివరించడానికి మేము సృజనాత్మక స్వేచ్ఛను ఉపయోగించాము.

"యేసు చేసిన అద్భుతాలు" ముగింపులో, మిరాకులో కనబడని తీగను ఉపయోగించి ఎలా "పైకి లేవడం" మనం చూస్తాం మరియు పార్క్ బెంచీల వంటి వస్తువులను "అదృశ్యం" చేయడానికి చాలా మంది ఇంద్రజాలికులు పొగ మరియు అద్దాలను ఉపయోగిస్తారని మనకు తెలుసు. అయితే మిరాకులో క్రిస్ సెల్ ఫోన్‌ను అతని జేబులోంచి "ఎగిరిపోవడం" ఎలా చేశాడు?

వీధి ఇంద్రజాలికులు తరచుగా ఇలాంటి భ్రమను సాధించడానికి అనుమానించని ప్రేక్షకులను రహస్యంగా అమర్చడానికి సహచరులను ఉపయోగిస్తారు.

ప్రత్యక్షత

కత్తులతో క్రూరంగా కనిపిస్తున్న సైనికులు ఎవరు?

వారు పడిపోయిన దేవదూతలు, లేకపోతే దయ్యాలు లేదా దురాత్మలు మేము వాటిని పరలోకపు దేవదూతల కంటే కొంచం నలుపు రంగులో ఉండేలా చేసాము, కాబట్టి పిల్లలు తేడాను చూడటం సులభం అవుతుంది.

ఎర్రటి ముఖంతో, కొమ్ములతో, మండుతున్న తలతో, రెక్కలతో సాతానును ఎందుకు అంత భయానకంగా చేశారు?

సాతాను చక్కని ప్రతినాయకునిగా కనిపించాలని మేము కోరుకోలేదు, కానీ స్పష్టంగా చెడ్డవాడుగా ఉండాలి. అతని వ్యక్తీకరణలు దేవుడు మరియు అతని ప్రజలపై అతని కోపాన్ని చూపుతాయి.

దయచేసి సూపర్‌బుక్ ఎపిసోడ్‌ల కోసం ఉండాల్సిన సాధారణ వయస్సు 7 నుండి 12 సంవత్సరాలు అని గుర్తుంచుకోండి. అయినప్పటికీ, పిల్లలు తమ ఆధ్యాత్మిక ఎదుగుదలలో, నాటకీయ చిత్రణలకు సున్నితత్వంలో, మరియు తాము వీక్షించడానికి అలవాటుపడిన కార్యక్రమాల విషయంలో విభిన్నంగా ఉంటారు కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలలో ప్రతి ఒక్కరికి ఏ ఎపిసోడ్‌లు సరిపోతాయో పరిశీలించవలసిందిగా సూచిస్తున్నాము. కొన్ని ఎపిసోడ్‌ల విషయంలో, తల్లిదండ్రులు ఎపిసోడ్‌ని తమ పిల్లలకు చూపించక ముందు, వారు ముందుగా ఒకసారి వీక్షించవలసిందిగా సలహా ఇస్తున్నాము.

క్రిస్ వెళ్లిన ఎండిపోయిన మరియు సారంలేని ప్రదేశం ఏది?

అది క్రిస్‌ను పరీక్షించడానికి సూపర్‌బుక్ తీసుకొచ్చిన నిర్జన ప్రాంతం.

సాతాను దేవదూతలా ఎందుకు కనిపించాడు?

సాతాను పరలోకపు దేవదూతలా కనిపించడానికి మారువేషంలో ఉండవచ్చు. బైబిల్ మనకు చెబుతుంది, సాతాను కూడా వెలుగు దూత వలె మారువేషంలో ఉంటాడు (2 కొరింథీయులు 11:14 NLT). అసాధారణ విషయాలు నిజంగా దేవునివేనా కాదా అని క్రైస్తవులు గుర్తించాలి.

సాతాను చేసిన చెడ్డ పని ఏమిటి?

అతను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. సాతాను తన సింహాసనాన్ని గొప్ప చేసుకొని దేవునిలా ఉండాలని కోరుకున్నాడు. సాతాను దుష్ట ప్రణాళికల గురించి బైబిల్ మనకు చెబుతోంది: నువ్వు నీ హృదయంలో, ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకుంటాను ఉత్తరం వైపు ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదకు ఎక్కుతాను, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానంగా చేసుకుంటాను’ అనుకున్నావు (యెషయా 14:13-14 IRVTEL).

పరలోకపు సింహాసన గది వెలుపల జాయ్ మరియు గిజ్మోతో మాట్లాడినప్పుడు యోహాను చేతిలో ఉన్న చుట్టలు ఏమిటి?

అవి యోహానుకు పరలోకంలో దేవుడు చూపించిన దర్శనాలను నమోదు చేసిన గ్రంథపు చుట్టలు. మానవజాతి అంతా వాటి నుండి ప్రయోజనం పొందేలా ఆయన వాటిని రాశాడు. పరలోకంలో యోహాను చూసిన దర్శనాల ఆరంభంలో, “నువ్వు చూస్తున్నది ఒక పుస్తకంలో రాయి. దాన్ని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయలలో ఉన్న ఏడు సంఘాలకు పంపు” అని అతనికి సూచించబడింది (ప్రకటన 1: 11 IRTEL). ప్రకటన గ్రంధంలో, సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, అని కూడా రాసి ఉంది. “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు (ప్రకటన 21: 5 IRTEL).

సాతాను క్రిస్‌కి దర్శనం చూపించే ముందు, సాతాను రెక్కల నుండి వెలువడి, క్రిస్‌పై వీచిన పర్పుల్-వైలెట్ కాంతి మేఘం ఏమిటి?

ఇది ఒక కాలం లేదా దృశ్యం నుండి మరొక దానికి మార్పు చెందే విజువల్ ఎఫెక్ట్

యేసు పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఎవరు?

వాళ్ళు యేసు యొక్క మిగిలిన పదకొండు మంది శిష్యులు (అపొస్తలుల కార్యములు 1:6-11).

చెట్టు నేల నుండి పైకి లేచేలా సాతాను ఎలా చేయగలడు?

సాతాను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ముందు, అతను లూసిఫర్ అనే గొప్ప దేవదూత. అతను ప్రధాన దేవదూత అయి ఉండవచ్చు. దేవుడు సాతానును పరలోకం నుండి వెళ్లగొట్టినప్పటికీ, అతనికి ఇప్పటికీ మానవాతీతమైన శక్తి ఉంది. సాతాను మరియు అతని మిత్రులు ప్రజలను మోసగించడానికి మానవాతీతమైన విన్యాసాలు చేస్తారని ప్రకటన గ్రంధం వెల్లడిస్తుంది. ప్రకటన 16:14 మనకు చెబుతుంది, అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవునికి వ్యతిరేకంగా యుద్ధానికి వారిని సమీకరించడానికి వారు భూమిపై ఉన్న ప్రతి రాజు వద్దకు వెళ్లారు. కానీ అది దేవుని గొప్ప విజయపు రోజు అవుతుంది (CEV). మరిన్ని ఉదాహరణల కోసం, మీరు ప్రకటన 13:3 మరియు ప్రకటన 13:13-14 చదవవచ్చు.

చెట్టు మీద ఉన్న పండు ఏమిటి?

ఇది దేవునిలా ఉండాలనే ప్రలోభానికి మరియు క్రిస్ అపరాధం మరియు అవమానం లేకుండా ఉండాలి అనే దానికి ప్రతీక. ఇది ఏదెను తోటలో ఉన్న అదే పండు కాదు.

క్రిస్ మీద వచ్చిన బంగారపు వెలుగు ఏమిటి?

ఎల్లప్పుడూ అతనితో ఉంటానని దేవుడు చేసిన వాగ్దానాన్ని క్రిస్‌కు గుర్తు చేయడానికి వచ్చిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ క్రిస్‌కు భయపడవద్దని మరియు కష్ట సమయాల్లో దేవుడు అతనిని రక్షిస్తాడని హామీ ఇచ్చాడు.

సాతాను కొమ్ములున్న పాములా ఎందుకు మారాడు?

మేము సాతానును "ఆదియందు" అనే ఎపిసోడ్‌లో ఉన్న అదే పాముగా రూపాంతరం చెందుతున్నట్లు చూపించాము, ఇప్పుడు అది చాలా పెద్దది మరియు చాలా భయంకరంగా ఉంది. ప్రకటన గ్రంధంలో సాతాను చిత్రీకరించబడినట్లుగా మేము చూపించదలుచుకోలేదు, ఎందుకంటే దీనిని భారీ ఎత్తున ప్రతీకాత్మకంగా చూపించాల్సి ఉంటుంది - దాని అర్థం చర్చకు వస్తుంది.

యేసు తెల్ల గుర్రంపై ఎందుకు స్వారీ చేస్తున్నాడు?

ప్రకటన పుస్తకంలో యేసు తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడింది: అప్పుడు పరలోకం తెరవబడి ఉండడం నేను చూశాను, అక్కడ ఒక తెల్ల గుర్రం నిలబడి ఉంది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు. ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు. ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది. (ప్రకటన 19:11-13, IRVTEL). మీరు ప్రకటన 19:11-21లోని మొత్తం భాగాన్ని చదవవచ్చు.

సూపర్‌బుక్ ఎపిసోడ్ “ప్రకటన: అంతిమ యుద్ధం!" ‌లో యేసు వెనుక ప్రధాన దేవదూతలు కూడా తెల్ల గుర్రాలపై స్వారీ చేస్తున్నారు.

ఎందుకు మీరు ప్రకటన గ్రంధంలో నుండి యేసు వివరాలు అన్ని చూపించలేదు?

యేసు వర్ణనలో చేర్చబడిన ప్రతీకవాదం చాలా వివరంగా మరియు గ్రాఫిక్ తో ఉంటుంది. అది చిన్న పిల్లలకు చాలా కష్టంగా లేదా గందరగోళంగా ఉండవచ్చు.

యేసు తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్నప్పుడు ఎందుకు అంత తీవ్రంగా కనిపించాడు?

ఆయన చూపులు దృఢంగా మరియు శత్రువైన, సాతాను మరియు అతని సైన్యాల మీద కేంద్రీకరించబడి ఉన్నాయి.

దేవదూతల సైన్యం నుండి వచ్చే నీలిరంగు కాంతి వలయాలు ఏమిటి?

యుద్ధంలో ఉపయోగించిన కొన్ని అసమాన శక్తులను దృశ్యమానంగా చిత్రీకరించడానికి అవి జోడించబడ్డాయి.

సాతాను మీదకు యేసు తన చేతిలో నుండి విసిరిన పర్పల్ -వైలెట్ కాంతి ఏమిటి?

అది యేసు యొక్క అసమాన మరియు దైవిక శక్తిని దృశ్యమానంగా ప్రతిబింబిస్తుంది. యేసు పరలోక శక్తిని ఉపయోగిస్తున్నాడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము.

యేసు విసిరిన కాంతి అతనికి తగిలినప్పుడు సాతాను చనిపోయాడా?

యేసు చేతిలో సాతాను ఓడిపోవడం అనేది సాతాను మండుతున్న గంధకం సరస్సులో పడవేయబడడాన్ని సూచిస్తుంది. వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు. (ప్రకటన 20:10 IRVTEL).

ఆకాశం నుండి దిగుతున్న బంగారు భవనం ఏమిటి?

అది దేవుని నగరం, నూతన యెరూషలేము. ప్రకటన గ్రంధం ఇలా చెబుతోంది, అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను. (ప్రకటన 21:2 IRVTEL).

చివర్లో క్రిస్ చూసిన దృశ్యం ఏమిటి?

యోహాను వర్ణిస్తున్న దర్శనాన్ని క్రిస్ చూశాడు. దేవుడు చేయబోయే అద్భుతమైన పనుల గురించి బైబిలు చెబుతోంది: ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి. అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు (ప్రకటన 21:4-5 IRVTEL).

సింహాసన గదికి ద్వారం ఎందుకు అద్దంలా ఉంది?

మేము ప్రధాన వీధికి అద్దంలా స్పష్టంగా ఉండే పరలోకపు రూపాన్ని ఇవ్వాలనుకున్నాం వాకిలి ముత్యాలతో చేసిన నగర ద్వారాల వలె లేదు: దాని పన్నెండు ద్వారాలూ పన్నెండు ముత్యాలు. ఒక్కో ద్వారాన్నీ ఒక్కో ముత్యంతో కట్టారు. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారం. (ప్రకటన 21:21 IRVTEL).

దేవుని సింహాసనం చుట్టూ ఉన్న చిన్న సింహాసనాలు ఏమిటి?

ప్రకటన గ్రంథం చెబుతున్నట్లుగా, అవి ఇరవై నాలుగు పెద్దల సింహాసనాలు. ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు వేరే సింహాసనాలున్నాయి. వాటి మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి. (ప్రకటన 4:4 IRVTEL).

సింహాసనం నుండి క్రిందికి వస్తున్న జలపాతం ఏమిటి?

అది దేవుని సింహాసనం నుండి ప్రవహించే జీవనది. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు, అప్పుడు జీవజలనదిని ఆ దూత నాకు చూపించాడు. అది స్ఫటికంలా నిర్మలంగా మెరుస్తూ ఉంది. అది దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం నుండి ప్రవహిస్తుంది (ప్రకటన 22:1 IRVTEL).

దేవుని సింహాసనం చుట్టూ ఎగురుతున్న రెక్కలుగల జీవులు ఏమిటి?

వారు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన నాలుగు జీవులు: ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికంలాటి సముద్రంలాటిది ఉంది. మధ్యలో మరియు సింహాసనం చుట్టూ నాలుగు జీవులు ఉన్నాయి, ముందూ వెనకా కళ్ళు ఉన్న నాలుగు ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి. (ప్రకటన 4:6 IRVTEL). అవే "పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు' అని పాడుతున్నాయి. బైబిల్ చెబుతుంది, ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, “పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అంతటినీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు. (ప్రకటన 4:8 IRVTEL).

దేవుని సింహాసనం చుట్టూ ఆకుపచ్చ రంగు మేఘం ఏమిటి?

ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తూ ఉందని బైబిల్ చెబుతోంది: ఆ సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తి చూడడానికి సూర్యకాంత మణిలాగా కెంపులాగా ఉన్నాడు సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తూ ఒక ఇంద్రధనుస్సు ఆవరించి ఉంది. (ప్రకటన 4:3 IRTVEL).

యేసు దేవుని సింహాసనం పక్కన ఎందుకు నిలబడి ఉన్నాడు?

యేసు దేవుని పవిత్ర కుమారుడు మరియు ఇప్పుడు పరలోకంలో మహిమపరచబడ్డాడు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం అక్కడ ఉంటుంది. ఆయన సేవకులు ఆయనకు సేవ చేస్తారు (ప్రకటన 22:3 IRVTEL) అని ప్రకటన గ్రంథం చెబుతోంది. సింహాసనానికీ ఆ నాలుగు ప్రాణులకూ పెద్దలకూ మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వధ అయినట్టుగా కనిపించింది. (ప్రకటన 5:6 NLT). అని కూడా బైబిల్ కూడా మనకు చెబుతుంది.

సామాన్య విషయాలు

సాతాను అనేక సూపర్‌బుక్ ఎపిసోడ్‌లలో చూపబడింది. అతను రెక్కలు మరియు తోకతో ఎగిరే సర్పంలాగా ఎందుకు చిత్రీకరించబడ్డాడు?

లూసిఫర్ లేదా దుష్టశక్తి అని కూడా పిలువబడే సాతాను గురించి బైబిల్ ప్రత్యేకంగా వివరించలేదు; కాబట్టి అతను ఎలా కనిపిస్తాడో చూపించడానికి మేము సృజనాత్మక స్వేచ్ఛను వాడుకొన్నాం. "ఆదియందు" అనే ఎపిసోడ్‌లో, లూసిఫర్‌ను పరలోకంలో దేవదూతగా మొదటిసారి చూపించినప్పుడు, అతను పొడవాటి రాగి జుట్టుతో అందమైన జీవిగా చిత్రీకరించబడ్డాడు. అతను దేవునికి మీద తిరుగుబాటు చేసినప్పుడు, అతను దుష్ట జీవిగా రూపాంతరం చెందుతాడు మరియు అతని వ్రేలాడే జుట్టు కొమ్ములుగా మారుతుంది. అలాగే, అతని శరీరం ఏదెను తోటలో పాము రూపంలోకి మారుతుంది. (ఆదికాండము 3:1 చూడండి.) మేము చక్కని ప్రతినాయకునిగా కనిపించే పాత్రలా సాతానును సృష్టించాలని అనుకోలేదు. నిజమైన శత్రువు ఉన్నాడని, అతను చెడ్డవాడని పిల్లలు అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము.



మీకు సూపర్‌బుక్ సిరీస్ గురించి మరిన్ని ప్రశ్నలు ఉన్నాయా? మీరు మరిన్ని వివరాలను ఇక్కడ చూడవచ్చు: www.cbn.com/superbook



ప్రొఫెసర్ క్వాంటమ్స్ Q & ఒక వింత పరికరం